విమానం ఢీకొని 29 ఫ్లెమింగ్ పక్షులు మృతి.. ముంబై సిటీలో కలకలం

విమానం ఢీకొని 29 ఫ్లెమింగ్ పక్షులు మృతి.. ముంబై సిటీలో కలకలం

ముంబై మహా నగరం.. 2024, మే 20వ తేదీ.. సోమవారం రాత్రి.. ఆకాశం నుంచి సహజంగా వర్షం పడుతుంది.. ఆ రాత్రి మాత్రం పక్షులు పడ్డాయి.. అవి కూడా ఫ్లెమింగ్ పక్షులు.. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఫ్లెమింగో పక్షలు ఆకాశం నుంచి చనిపోయి పడటం కలకలం రేపింది. రోడ్లపై.. ఇళ్లపై పడుతున్న ఫ్లెమింగో పక్షులను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జంతు, పక్షి ప్రమికులు తరలివచ్చారు. దీనికి కారణం ఏంటీ అంటారా.. వివరాల్లోకి వెళితే..

ముంబై ఘట్కోపర్ ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాలలో చాలా ఫ్లెమింగోలు చనిపోయాయి. విమానం ఢీకొనడమే మరణాలకు కారణమని తేలింది. చనిపోయిన పక్షులు కింద పడగా స్థానికులు వాటిని గమనించి పోలీసులుకు ఫోన్ చేశారు. రెస్‌కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. అటవీ శాఖ బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ప్రాంతంలో 29 చనిపోయిన ఫ్లెమింగోలను కనుగొన్నట్లు  తెలిపారు.

ఫ్లెమింగోలు ఎమిరేట్స్ విమానాన్ని గాలిలో ఢీకొన్నట్టు ఆరోపిస్తున్నారు బర్డ్ వెల్ఫేర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు. ఎన్‌ఆర్‌ఐ కాంప్లెక్స్ ప్రాంతంలోని చిత్తడి నేలలు, టిఎస్ చాణక్య సరస్సులు ఫ్లెమింగో మందలకు నిలయమని గత నెల నుంచి అక్కడి పక్షులకు ఆటంకం కలిగించి నీటి వనరులను నిర్మాణంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు వ్యక్తులు రాత్రిపూట పక్షులను తరిమివేసి ఉంటే, మందలు థానే క్రీక్ వైపు ఎగరడానికి ప్రయత్నించి ప్రమాదానికి గురై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.