17 ఏళ్ల కుర్రోడు.. తాగి కారుతో గుద్ది ఇద్దరిని చంపాడు.. 15 గంటల్లోనే బెయిల్ వచ్చిదంట..!

17 ఏళ్ల కుర్రోడు.. తాగి కారుతో గుద్ది ఇద్దరిని చంపాడు.. 15 గంటల్లోనే బెయిల్ వచ్చిదంట..!

పూణేలో మైనర్ బాలుడు పబ్ నుంచి బయటకు వచ్చి చేసిన పోర్స్చె కారు యాక్సిడెంట్‌లో ఇద్దరు చనిపోయారు. ఈ యాక్సిడెంట్ రెండు రోజులుగా పూణేలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఆదివారం (మే19)న తెల్లవారుజామున 3గంటలకు లగ్జరీ కారు పోర్స్చెని నడుపుతూ 17 ఏళ్ల బాలుడు బైక్ పై వస్తున్న ఇద్దర్ని  ఢీకొట్టాడు. ఈ యాక్సిడెంట్ లో  అశ్విని, అనీష్ అవధియా చనిపోయారు.  పోలీసులు కేసు నమోదు చేసి మైనర్ బాలుడిని జూవైనల్ కోర్టులో హాజరు పరిచారు. జూవైనల్ కోర్టు నింధితునికి కొన్ని కండిషన్లపై బెయిల్ ఇచ్చింది. తప్పతాగి ఇద్దరి ప్రాణాలు తీస్తే.. రెండు రోజులకు బెయిల్ ఇస్తారా అని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

యాక్సిడెంట్ చేసింది ఓ డబ్బున్న బిజినెస్ మ్యాన్ కొడుకు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిదని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. టైంకు మించి ఎక్కువ సేపు నడుపుతున్న రెండు పబ్ లపై, మైనర్ కుర్రాడికి కారు ఇచ్చినందుకు అతని తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ చేసిన మైనర్ 15రోజుల పాటు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కు హెల్ప్ చేయాలని కండీషనల్ బెయిల్ మంజూరుచేశారు. 

ఆ బెయిల్ ను రద్దు చేయాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నాయి. అరెస్ట్ అయిన ఇద్దరి చావుకు కారణమైన వాడికి అరెస్ట్ అయిన 15గంటల్లోనే బెయిల్ ఏలా ఇచ్చారని కోర్టును ప్రశ్నిస్తున్నారు. మాకు న్యాయం జరుగుతున్నట్లు అనిపించడం లేదని ఆగ్రహం తెలిపుతున్నారు.  బెయిల్ క్యాన్సల్ చేసి నింధితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.