ఆప్ రెబెల్ ఎంపీ సందీప్ పాఠక్ పరార్... అరెస్ట్ ముప్పు పొంచి ఉండటంతో అదృశ్యం!

ఆప్ రెబెల్ ఎంపీ సందీప్ పాఠక్ పరార్... అరెస్ట్ ముప్పు పొంచి ఉండటంతో అదృశ్యం!

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు షాక్ ఇచ్చి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సందీప్ పాఠక్ అదృశ్యమయ్యారు. పంజాబ్‌‌‌‌లో ఆయనపై నమోదైన రెండు కేసుల నేపథ్యంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉండడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సందీప్ పాఠక్‌‌‌‌పై పంజాబ్‌‌‌‌లో నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద రెండు కేసులు నమోదయ్యాయి. 

శనివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి వెనుక తలుపు ద్వారా సందీప్ కారులో వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం సందీప్ ఫోన్ పని చేయట్లేదని, ఎవరికీ అందుబాటులో లేరని తెలుస్తోంది. 

ఆయనకు న్యాయపరమైన రక్షణ కల్పించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఏప్రిల్ 24న సందీప్ పాఠక్ ఏడుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. మొత్తం 10 మంది ఎంపీల్లో ఏడుగురు ఒకేసారి బీజేపీలో చేరడంతో వీరిపై అనర్హత వేటు పడే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.