ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్‌కి జైలులో మసాజ్

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్‌కి జైలులో మసాజ్

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైలులో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. జైలు సిబ్బంది సహకారంతో  ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. జైలు గదిలో జైన్ కు వీఐపీ ట్రీట్ మెంట్ జరుగుతోంది. అందుకు సంబంధించిన వీడియో బయటకు రావడం సంచలనం రేపుతోంది. అందులో జైన్ కు కొందరు వ్యక్తులు మసాజ్ చేస్తున్న దృశ్యాలు  కనిపించాయి. జైన్ మంచంపై పడుకుని ఉండగా బాడీ మసాజ్..ఫుట్ మసాజ్..బ్యాక్ మసాజ్ చేశారు. అనంతరం అతను కూర్చొని ఉండగా హెడ్ మసాజ్ చేశారు. 

గతంలో ఎన్ ఫోన్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి జైన్ కు జైలులో పలు సౌకర్యాలకు సంబంధించిన ఆధారాలు కోర్టుకు సమర్పించింది. అంతేకాదు సమయం దాటినా జైన్ కు ప్రత్యేక ఆహారం అందజేస్తున్నారని ఈడీ తరపున హాజరైన సొలిసిటర్ జనరల (ASG) SV రాజు తెలిపారు. జైన్ జైలు జీవితంకు సంబంధించిన కొన్ని సీసీటీవీ పుటేజీలను  కోర్టుకు సమర్పించారు. ఈ ఘటనపై జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ను సస్పెండ్ చేయగా..సిబ్బందిపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు 

జైలులో వీవీఐపీ జీవితం గడుతుపున్న సత్యేంద్రజైన్ ను మంత్రి పదవి నుంచి తప్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్ ఎలా సమర్థంచుకుంటారని ప్రశ్నించింది. జైన్ పాదాలకు మసాజ్ చేస్తున్న సీసీటీవీ పుటేజీని బీజేపీకి చెందిన షెహజాద్ ట్వీట్ చేశాడు. మనీలాండరింగ్ కేసులో  మే 30  సత్యేంద్రజైన్ అరెస్ట్ అయ్యారు.