వనమహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ ఫ్యామిలీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. గురువారం ( జూన్ 18 ) గుర్రంగూడలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు సీఎం రేవంత్. మూసీ పునరుజ్జీవం చేస్తామంటే అడ్డుపడుతున్నారని.. మూసీలో ఉండే కాలుష్యం కంటే కల్వకుంట్లోళ్ల కడుపులో విషం ఎక్కువని అన్నారు. మూసీ పునరుజ్జీవం వద్దంటున్న సుధీర్ రెడ్డి గతంలో మూసీ కార్పొరేషన్ చైర్మెన్ పదవి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.
భూకబ్జాలతో ప్రజలకు సమస్య రావొద్దని హైడ్రా తెచ్చామని... హైడ్రాను భూతంలా చూపిస్తున్నారని మండిపడ్డారు.హైడ్రా పేదల జోలికి వెళ్ళదని.. కబ్జాదారుల భరతం పడుతుందని అన్నారు. వనస్థలిపురంలో దేవుడి భూములు కబ్జా పెట్టారని.. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే వీపులు సున్నం పెడతానని అన్నారు.
►ALSO READ | నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకొని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. మన హైదరాబాద్ కు ఆ పరిస్థితి రావొద్దని మొక్కల పెంపకం చేపట్టామని అన్నారు. మూసీ పునరుజ్జీవం చేస్తామంటే అడ్డుపడుతున్నారని.. మూసీ ఒడ్డున ప్రజలను తరలించి అభివృద్ధి చేస్తామంటే మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్.
