ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు... భారీగా నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం..

ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు... భారీగా నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం..

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. బుధవారం ( జూన్ 3 ) జరిగిన ఈ సోదాల్లో భుజంగరావు నివాసంలో భారీగా డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లను ఏసీబీ ఆఫీసుకు తరలించారు అధికారులు.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో.. ఏకకాలంలో సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. కేవలం భుజంగరావు నివాసంలోనే కాకుండా.. ఆయనకు సంబంధించిన మొత్తం 15 ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు సూర్యాపేటలోని భుజంగరావు బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేపట్టారు. 

ఆయన సర్వీస్ కాలంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. కీలక డాక్యుమెంట్లు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు ఇప్పుడు ఈ అవినీతి తిమింగలం ఆస్తుల చిట్టా కూడా బయటకు రావడంతో పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.