3 నెలల్లో 10 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు..ఏసీబీ డీజీ చారు సిన్హా వెల్లడి

3 నెలల్లో 10 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు..ఏసీబీ డీజీ చారు సిన్హా వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు:  అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోందని, గత మూడు నెలల్లోనే ఏకంగా 10 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేశామని ఏసీబీ డీజీ చారుసిన్హా వెల్లడించారు.  విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ మంగళవారం రివార్డ్ మేళా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అవినాష్ మహంతితో కలిసి సిబ్బందికి  ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు. అనంతరం గత మూడు నెలల్లో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతిపై   సమీక్ష నిర్వహించారు.  రెండో త్రైమాసికంలో 10 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులతో పాటు, 34 ట్రాప్ కేసులు నమోదు చేశామని, 23 సర్‌‌ప్రైజ్ చెక్‌‌లు నిర్వహించామని వెల్లడించారు.