మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎమ్మార్వో సుచరిత డ్రైవర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుని ఎమ్మార్వోకు ఇస్తుండగా పట్టుబడ్డాడు డ్రైవర్. లంచం వ్యవహారంపై కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఎమ్మార్వో సుచరితను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తోంది ఏసీబీ టీమ్. ఎమ్మార్వోతో పాటు కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
