పైపులైన్ తొలగింపునకు రూ.10 వేలు లంచం..ఏసీబీకి చిక్కిన కార్యదర్శి, సర్పంచ్ భర్త

పైపులైన్ తొలగింపునకు రూ.10 వేలు లంచం..ఏసీబీకి చిక్కిన కార్యదర్శి, సర్పంచ్ భర్త

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్‌తో పాటు సర్పంచ్ భర్త గొల్లపల్లి ఆంజనేయులు సోమవారం రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. కొమురవెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ప్లాట్‌లో గ్రామ పంచాయతీ తరఫున వేసిన డ్రైనేజీ పైప్‌లైన్‌ను తొలగించాలని కోరాడు. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శి రాజుగౌడ్ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో సోమవారం ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. జీపీ ఆఫీసులో పంచాయతీ కార్యదర్శి రాజుగౌడ్​, సర్పంచ్ భర్త ఆంజనేయులు బాధితుడి నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.