పెళ్లి కావడం లేదని దివ్యాంగుడి సూసైడ్

పెళ్లి కావడం లేదని దివ్యాంగుడి సూసైడ్

గోదావరిఖని, వెలుగు: పెళ్లి కావడం లేదని మనస్తాపానికి గురైన దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖని టూ టౌన్​ పీఎస్‌‌ పరిధిలోని హనుమాన్​నగర్‌‌‌‌కు చెందిన మహ్మద్​ రియాజ్(28)కు పుట్టుకతోనే చెవుడు, నత్తి ఉంది. స్థానికంగా ఓ చికెన్​ షాప్​లో పనిచేస్తుండగా అతనికి పెళ్లి చేయాలని పేరెంట్స్‌‌ నిర్ణయించుకొని సంబంధాల కోసం వెతుకుతున్నారు. అయినప్పటికీ సంబంధాలు కుదరకపోవడంతో రియాజ్​ మద్యానికి బానిసయ్యాడు. తనకు వివాహం కావడం లేదని మదనపడుతూ బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకున్నాడు.