భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియపై ప్రజల సందేహాల నివృత్తి కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1950 అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25 వరకు బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తారని చెప్పారు. 2002 ఓటర్ల జాబితా ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలను ధృవీకరించి నమోదు చేస్తారన్నారు.
జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా, అక్టోబర్ 1న తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. వలస వెళ్లిన, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల పేర్లను తొలగిస్తామని, కొత్త ఓటర్లు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
