రాజధాని సిటీ మొత్తం మటాష్.. పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిట్టనిలువునా కూలిపోయాయి.. కొన్ని భవనాలు సగం కూలిపోయాయి.. మరికొన్ని భవనాలు ఉండటానికి వీల్లేనంతగా మారాయి.. చిన్నా పెద్దా తేడా లేదు.. జస్ట్.. కేవలం 39 సెకన్లు.. నిమిషం కూడా కాదు.. కేవలం 39 సెకన్లలో అందరూ రోడ్డుపైకి వచ్చారు. నిలువ నీడలేకుండా జనం రోడ్డున పడ్డారు.. ఎటు చూసినా శిధిలాల కుప్పలు.. ఆ శిధిలాల కింద వేల శవాలు.. ప్రతి ఒక్కరూ సాయం కోసం అర్థించేవాళ్లే.. నా వాళ్లు ఎక్కడున్నారు.. వాళ్లు బతికే ఉన్నారా లేదా అనే ఆందోళననే.. ఇదీ ఇప్పుడు వెనెజువెలా రాజధాని కారాకాస్ సిటీలో పరిస్థితులు.
Desplome de edificios en #Caracas #Venezuela con una intensidad de 7.5 pic.twitter.com/3rMmejf5My
— Neegann® (@NEEGANN) June 24, 2026
రెండు భారీ భూకంపాలు.. బ్యాక్ టూ బ్యాక్.. అది కూడా తీవ్ర స్థాయిలో వచ్చిన భూకంపాలు భూ ప్రళయాన్ని సృష్టించాయి. 10 వేల మంది చనిపోయారని అధికారికంగానే చెబుతున్న అక్కడి ప్రభుత్వం.. అక్షరాల లక్ష మంది చనిపోయి ఉండొచ్చని చెబుతుంది.. ఇది జస్ట్ భూకంపం వచ్చిన రెండు గంటల తర్వాత ప్రాథమిక అంచనా మాత్రమే.. లక్ష మంది కంటే ఎక్కువ ఉండొచ్చు.. పోయిన ప్రాణాలే కాదు.. ఉన్నోళ్లు నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డారు.. లక్షల కోట్ల ఆస్తి విధ్వంసం.. 2026లోనే అత్యంత శక్తివంతమైన భూ ప్రళయంగా దీన్ని చెప్పొచ్చు..
Devastating footage from Venezuela after two major earthquakes strike hours ago 😣 pic.twitter.com/Ka9iyGcSsE
— 🇦🇪 HGS (@Sajwani) June 25, 2026
గత వందేళ్లలో ఎన్నడూ చూడని భారీ భూకంపం వెనెజువెలా దేశాన్ని శోక సంద్రంలో ముంచేసింది. 39 సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాల తీవ్రతకు వెనెజువెలా రాజధాని నగరం కారకాస్లో బిల్డింగులు ఎక్కడికక్కడ నేలమట్టం అయిన పరిస్థితి ఉంది. రిక్టర్ స్కేల్పై 7.2 తీవ్రతతో ఒక భూకంపం, 39 సెకన్ల వ్యవధిలో 7.5 తీవ్రతతో మరో భూకంపం వెనెజువెలా దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. ఈ వరుస భూకంపాల కారణంగా వెనెజువెలాలో లక్ష మంది వరకూ చనిపోయి ఉండొచ్చని USGS (United States Geological Survey) అంచనా వేసింది.
జూన్ 24న ప్రభుత్వ సెలవు దినం కావడంతో వెనెజువెలా ప్రజలంతా ఇళ్లలోనే ఉన్నారు. ఈ సమయంలో వరుస భూకంపాలు రావడంతో ఇళ్ల నుంచి పరుగులు తీసి ప్రజలు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ.. వేల మంది ఈ క్రమంలోనే బిల్డింగులు కుప్పకూలి మరణించారు. శిథిలాల కింద శవాలు కుప్పలుకుప్పలుగా కనిపించిన దృశ్యాలు హృదయవిదారకంగా అనిపించాయి. ఈ భూకంపాల కారణంగా వెనెజువెలాలో లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
మైక్వేటియా అంతర్జాతీయ విమానాశ్రయంలో పైకప్పు కూలిపోవడం, నిప్పురవ్వలు ఎగసిపడటంతో భయభ్రాంతులైన ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తూ, తమ కుటుంబాలను కాపాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కారకాస్‌లో భూకంపం సంభవించి, విద్యుత్ తీగలు, స్టేడియం సీట్లు కంపిస్తున్నప్పుడు, బేస్‌బాల్ ఆటగాళ్లు, ప్రేక్షకులు ఆట జరుగుతున్న మైదానంలోకి పరుగెత్తుతున్న దృశ్యాలు వెనెజువెలాలో భూకంప తీవ్రతను కళ్లకు కట్టాయి.
