కామారెడ్డిలో అక్రిడిటేషన్ కార్డుల కోసం జర్నలిస్టుల ఆందోళన

కామారెడ్డిలో  అక్రిడిటేషన్ కార్డుల కోసం జర్నలిస్టుల ఆందోళన

కామారెడ్డి, వెలుగు: జర్నలిస్టులకు అక్రిడిటేషన్​కార్డుల జారీలో డీపీఆర్వో నిర్లక్ష్య వైఖరీని నిరసిస్తూ  బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా చేశారు. కమిటీ అమోదించిన 273 అక్రిడిటేషన్​కార్డుల్లో కొన్నింటిని మాత్రమే జారీ చేసి  మిగతావి ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు.

అర్హులైన జర్నలిస్టులకు వెంటనే కార్డులు ఇవ్వాలని, డీపీఆర్వోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​కు వినతిపత్రం అందజేశారు.  అర్హులైన వారికి కార్డులు అందేలా  చర్యలు తీసుకుంటానని కలెక్టర్​ హామీ ఇచ్చారు. ఆందోళనలో  టీయూడబ్యూజే జిల్లా ప్రెసిడెంట్​రజినీకాంత్​, జనరల్ సెక్రటరీ తోట రాజేశ్, ట్రెజరర్ వెంకటేశ్​తో పాటు జిల్లాలోని ఆయా ఏరియాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.