కోల్ బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాదులోని మంత్రి కార్యాలయంలో మాజీ ఎంపీటీసీ రామటెంకి విజయ, సోషల్ మీడియా మాజీ బాధ్యుడు శశి కుమార్ తదితరులకు మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో కాంగ్రెస్లో కొనసాగిన వీరు ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి తాజాగా మంత్రి సమక్షంలో సొంత గూటికి చేరారు.
