కరీంనగర్ ఎక్సైజ్ సీఐ ఇంటిపై ఏసీబీ దాడి..భారీగా నగదు, బ్యాంక్ డిపాజిట్లు, స్థలాల పత్రాలు గుర్తింపు

కరీంనగర్ ఎక్సైజ్ సీఐ ఇంటిపై ఏసీబీ దాడి..భారీగా నగదు, బ్యాంక్ డిపాజిట్లు, స్థలాల పత్రాలు గుర్తింపు
  •     మార్కెట్ విలువ రూ. 10 కోట్లపైనే ఉంటుందని అంచనా
  •     లంచం తీసుకున్న కేసులో మార్చిలోనే పట్టుబడ్డ సీఐ

కరీంనగర్‌‌‌‌ క్రైం, వెలుగు : కరీంనగర్‌‌‌‌ అర్బన్ ప్రొహిబిషన్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎక్సైజ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్ గుండేటి రాము ఇంటిపై గురువారం ఏసీబీ ఆఫీసర్లు దాడి చేశారు. ఫోన్ ద్వారా లంచం తీసుకున్న కేసులో రాముతో పాటు అతని స్నేహితుడు జక్కని వేణును మార్చి 17న ఏసీబీ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాముపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడంతో ఏసీబీ ఆఫీసర్లు జగిత్యాల పట్టణం భవానీనగర్ లోని ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు.

 ఈ తనిఖీల్లో సోదాల్లో 20.67 లక్షల నగదుతో పాటు ఎస్‌‌‌‌బీఐ అకౌంట్ లో రూ.29.88 లక్షలు, ఆయన తండ్రికి చెందిన యూబీఐ బ్యాంక్ ఖాతాలో రూ.16.77 లక్షలు, రూ.11.97 లక్షల విలువైన ఇతర వస్తువులు, కరీంనగర్‌‌‌‌లో ఖాళీ స్థలం, సిరిసిల్లలో కమర్షియల్ ప్లాట్ సహా మొత్తం రూ.87.44 లక్షల విలువైన ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. 

ఈ ఆస్తుల మార్కెట్‌‌‌‌ విలువ రూ.10 కోట్లపైనే ఉంటుందని ఏసీబీ ఆఫీసర్లు భావిస్తున్నారు. అధికార దుర్వినియోగం ద్వారా ఈ ఆస్తులను సమకూర్చుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన ఏసీబీ అధికారులు.. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.