తెలుగు సినిమాలను ఏపీలో బ్యాన్ చేసినా నష్టం లేదు

తెలుగు సినిమాలను ఏపీలో బ్యాన్ చేసినా నష్టం లేదు

ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు సినిమాలను రిలీజ్ చేయొద్దన్నారు సినీ నటుడు నాగబాబు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. వైసీపీ వాళ్లకు సినిమా ఆపరేషన్స్ గురించి తెలియదన్నారు.  టోటల్ సినిమా బడ్జెట్ లో హీరోల రెమ్యునరేషన్ లు 10 లేదా 12 పర్సెంట్  ఉంటుందన్నారు.  సినిమాకు నష్టం వస్తే చాలా మంది హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్నారన్నారు. హీరోని బట్టే సినిమా వ్యాపారం జరుగుతది కానీ హీరోయిన్ వల్లో మిగతా కాస్టింగ్ వల్ల కాదన్నారు. టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి వైసీపీ నాయకులకు ఎలాంటి అవగాహన లేదన్నారు.  వ్యక్తిగత కారణాల వల్ల ఏపీ ప్రభుత్వం సినిమాపరిశ్రమలో కొంత మంది హీరోలను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఏపీలో ఏ వ్యాపారమైనా తమ చేతుల్లోకి తీసుకుంటున్నారన్నారు. సినిమా ఇండస్ట్రీని కూడా తమ చేతుల్లోకి తీసుకోవాలన్నారు. వెల్లంపల్లి, కొడాలి నాని లాంటి వారిని హీరోలుగా పెట్టి సినిమాలు చేసుకోవాలన్నారు. వాళ్లు బాగా నటిస్తారని..వాళ్ల ముందు తామెంతా అని అన్నారు. సినిమా ఇండస్ట్రీనీ గుర్తించి.. తమకు ఫైనాన్స్ ఇస్తే.. అప్పుడు టికెట్ రేట్లు మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోండని ప్రభుత్వానికి సూచించారు.

తెలుగు సినిమాను ఏపీలో బ్యాన్ చేసినా తమకు నష్టం లేదన్నారు. ఏపీ వరకు నెట్ ఫ్లెక్స్ అమెజాన్ లలో  సినిమాలు రిలీజ్ చేద్దామన్నారు. ప్రభుత్వాల మీద డిపెండ్ కాకుండా డబ్బులు ఎలా సంపదించాలో కొత్త గా ఆలోచిద్దామని సూచించారు నాగబాబు. ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం ఆశ తగ్గించుకొని ఒకటిగా ఉంటే తమను ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు. ప్రభుత్వానికి  భయపడితే చిన్న కార్మికులు రోడ్డున పడతారన్నారు. థియేటర్ యజమానులు కూడా అన్ని అనుమతులు తీసుకొని ఉంటే తమను ఏం చేయలేరన్నారు నాగబాబు.  హీరోలకు నిర్మాతలకు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లకు తన విజ్ఞపి ఏమిటంటే లాస్ అవుతాం కానీ చచ్చిపోయెంత లాస్ కాదన్నారు నాగబాబు..