తెలుగు చిత్ర పరిశ్రమలో 'హాస్య కిరీటి'గా, పద్మశ్రీ గ్రహీతగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. తన నోటి దురుసుతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఒక దిగ్గజ నటుడిని పొగిడే క్రమంలో, అంతకంటే పెద్ద దిగ్గజమైన మరో నటుడిని కించపరచడం ఇప్పుడు ఇటు టాలీవుడ్‌లో, అటు కోలీవుడ్‌లో పెను దుమారం రేపుతోంది. అభిమానులు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అసలేం జరిగింది?
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు-2025’ వేదికపై రాజేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ.. దివంగత నటుడు కాంతారావు గారి జానపద చిత్రాల గొప్పదనాన్ని వివరించారు. అయితే, ఆ క్రమంలో ఆయన వాడిన పదజాలమే విమర్శలకు దారితీసింది. కాంతారావు గారి కత్తియుద్ధాలు, ఆయన నటన చూసి తమిళనాడు ఆరాధ్య దైవం, మాజీ సీఎం ఎంజీఆర్ (M.G. Ramachandran) భయపడి ఉచ్చ పోసుకునేవారు. ఎవడ్రా వీడు.. ఇండియన్ సినిమాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అని వణికిపోయేవారు" అంటూ రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళ తంబీల ఆగ్రహం
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి, కోట్లాది మంది తమిళ ప్రజల గుండెల్లో 'పురట్చి తలైవర్' (విప్లవ నాయకుడు)గా కొలవబడే ఎంజీఆర్ పట్ల 'ఉచ్చ పోసుకునేవాడు' వంటి అసభ్యకర పదజాలాన్ని వాడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఒకరిని గౌరవించడానికి మరొకరిని కించపరచాలా?" అంటూ రాజేంద్ర ప్రసాద్ సంస్కారాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తమిళ సినీ అభిమానులు రాజేంద్ర ప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
►ALS O READ | బిగ్‌బాస్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి మరణంతో కన్నీరుమున్నీరవుతున్న డీమాన్!
పునరావృతమవుతున్న వివాదాలు!
రాజేంద్ర ప్రసాద్ ఇలా నోరు జారడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా బ్రహ్మానందం, అలీ వంటి సహ నటులపై బహిరంగ వేదికలపైనే సెటైర్లు వేస్తూ ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. మా (MAA) ఎన్నికల సమయంలోనూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద రచ్చకు దారితీశాయి. సీనియర్ నటుడిగా గౌరవప్రదమైన స్థానంలో ఉండి, 'పద్మశ్రీ' వంటి పురస్కారాలు అందుకున్న వ్యక్తి ఇలాంటి వీధి స్థాయి పదజాలాన్ని వాడటం తగదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
కాంతారావు తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు అనడంలో సందేహం లేదు. కానీ, ఆ గొప్పదనాన్ని చాటిచెప్పేందుకు పొరుగు రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టడం రాజేంద్ర ప్రసాద్ స్థాయికి తగని పని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం మరింత ముదరకముందే ఆయన వివరణ ఇస్తారో లేదో చూడాలి..
తమిళుల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎంజీఆర్ గారిని దారుణంగా అవమానించిన టీడీపీ మద్దతుదారుడు నటుడు రాజేంద్ర ప్రసాద్
— UttarandhraNow (@UttarandhraNow) March 10, 2026
వీరికి పద్మశ్రీ ఇచ్చిన ప్రభుత్వానికి 🙏🏻#TDP supporter #RajendraPrasad insults Greatest of all times #MGR.
சின்னத்திரை எம்ஜிஆரை அவமதித்த தெலுங்கு தேசம் கட்சி… pic.twitter.com/Nr1s54pFlU
