CSK Fielding Coach: ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ గా అవతరించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), 2026 సీజన్‌కు ముందు తమ జట్టును మరింత బలోపేతం చేసేందుకు తగిన చర్యలు ప్రారంభించింది. దీంతో మాజీ ఇంగ్లండ్ వికెట్ కీపర్- జేమ్స్ ఫోస్టర్ ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. 2025 ఐపీఎల్ సీజన్‌లో CSK నిరాశాజనక ప్రదర్శన చేసి, తొలిసారి పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలే సాధించింది.. దీంతో జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పుడు 2026 సీజన్‌కు ముందు తమ ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తోంది. CSK ఫ్రాంచైజీ సీఈఓ కాశి విశ్వనాథన్ మాట్లాడుతూ.. మేము ఫీల్డింగ్ కోచ్ కోసం చూస్తున్నాం.. ఫోస్టర్ త్వరలో జట్టుతో చేరతారని ఆశిస్తున్నామని తెలిపారు.
జెమ్స్ ఫోస్టర్ అనుభవం:
45 ఏళ్ల జేమ్స్ ఫోస్టర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్ తరఫున 2001 నుంచి 2009 మధ్యకాలంలో 7 టెస్టులు, 11 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడారు. వికెట్ కీపర్-బ్యాటర్‌గా తన సేవలను అందించారు. కాగా కోచింగ్ రంగంలో కూడా ఫోస్టర్ మంచి అనుభవం సంపాదించారు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫీల్డింగ్ కోచ్‌గా, డెజర్ట్ వైపర్స్, నార్తర్న్ సూపర్ చార్జర్స్, పేషావర్ జల్మీ వంటి జట్లతో పని చేశారు. ఈ అనుభవం CSKకు ఎంతో ఉపయోగపడనుంది. ఫోస్టర్ చేరికతో చెన్నై సూపర్ కింగ్స్ సపోర్ట్ స్టాఫ్ మరింత బలపడింది.
►ALSO READ | LPG Shortage Effect: మిడిల్ ఈస్ట్లో యుద్ధంతో LPG గ్యాస్ కొరత.. ఐపీఎల్ పై తీవ్ర ప్రభావం!
ప్రీసీజన్ క్యాంప్ ప్రారంభం
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే తమ ప్రీసీజన్ క్యాంప్‌ను ప్రారంభించింది. భారత ఆటగాళ్లు చెన్నైలోని హై-పర్ఫార్మెన్స్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఎంఎస్ ధోని, అయుష్ మహాత్రే లాంటి ఆటగాళ్లు ఇప్పటికే క్యాంప్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు సంజూ శాంసన్, శివం దూబే ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2026 ముగించుకుని త్వరలో జట్టులో చేరనున్నారు. అలాగే శ్రేయాస్ గోపాల్ దేశీయ క్రికెట్ బాధ్యతలు పూర్తయ్యాక టీమ్ తో జత కట్టనున్నాడు. కాగా గత సీజన్‌లో ఎదురైన వైఫల్యంతో CSK ఇప్పుడు జట్టును పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తోంది. జేమ్స్ ఫోస్టర్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా తీసుకోవడంతో IPL 2026లో బలంగా తిరిగి కమ్ బ్యాక్ ఇవ్వాలని టీమ్ ఫ్రాంచైజీ లక్ష్యంగా పెట్టుకుంది.
బలమైన కోచింగ్ స్టాఫ్:
* హెడ్ కోచ్: స్టీఫెన్ ఫ్లెమింగ్
* బ్యాటింగ్ కోచ్: మైక్ హస్సీ
* బౌలింగ్ కోచ్: ఎరిక్ సైమన్స్
* అసిస్టెంట్ బౌలింగ్ కోచ్: శ్రీధరన్ శ్రీరామ్
* ఫీల్డింగ్ కోచ్: రాజీవ్ కుమార్
* టీమ్ మేనేజర్: రస్సెల్ రాధాకృష్ణన్
