
ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాని లైన్‌లో పెట్టేస్తున్నారు. బాలకృష్ణ. ‘అఖండ’ చేస్తున్నప్పుడే గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సినిమాని అనౌన్స్ చేయడంతో పాటు పూజా కార్యక్రమాలతో లాంచ్ కూడా చేశారు. ఇప్పుడు సిరిసిల్లలో షూటింగ్ మొదలు పెట్టేశారు. ముందుగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. రామ్–లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ సీన్స్‌ని బాలయ్య, ఫైటర్లపై తీస్తున్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. కన్నడ నటుడు ‘దునియా’ విజయ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది బాలయ్యకి నూట ఏడో సినిమా. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని టీమ్ చెబుతోంది. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడితో వర్క్ చేయనున్నారు బాలయ్య. పూరి జగన్నాథ్, శ్రీకాంత్ అడ్డాల సినిమాలకీ ఓకే చెప్పా రని టాక్.