కరోనా ఎఫెక్ట్.. సెల్ఫ్ క్వారంటైన్ లో ప్రభాస్

కరోనా ఎఫెక్ట్.. సెల్ఫ్ క్వారంటైన్ లో ప్రభాస్

కరోనా వైరస్ రోజు రోజుకు ఎంత ప్రమాదకరంగా మారుతుంతో అందరికీ తెలుసు .ఈ వైరస్ దాటికి ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. వ్యాపార సంస్థలు, స్కూల్స్,కాలేజీలు, మాల్స్, థియేటర్స్, షూటింగ్స్, ఇలా అన్ని బంద్ అయ్యాయి. ఎవరికి వారు ఇంట్లో నుంచి బయటకు రాకుండా క్వారంటైన్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు సెలబ్రిటీలు క్వారంటైన్ అయ్యారు. ఆదివారం భారత ప్రభుత్వం కూడా జనతా కర్ఫ్యూ విధించింది.  లేటెస్ట్ గా ప్రభాస్ కూడా  కరోనా వైరస్ దాటికి సెల్ఫ్ క్వారంటైన్ అయ్యాడు. జార్జియాలో తన సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సేఫ్ గా ఇండియాకు తిరిగి వచ్చిన ప్రభాస్ సెల్ఫ్ క్వారంటైన్ అయినట్లుగా తన ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేశాడు. కోవిడ్19 విస్తరిస్తుండటంతో తాను  క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మీరందరూ కూడా  సురక్షితంగా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ చేశాడు.