సినీనటుడు సచిన్‌ జోషి అరెస్ట్‌

సినీనటుడు సచిన్‌ జోషి అరెస్ట్‌

మనీలాండరింగ్‌ కేసులో సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సచిన్ జోషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు నిన్న(ఆదివారం) రాత్రి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ED విచారిస్తున్న ఓం కార్ రియల్టర్స్ అండ్‌ డెవలపర్స్‌  కేసులో జేఎం జోషి గ్రూప్ ప్రమేయాన్ని నిర్ధారించుకున్న ఈడీ అధికారులు, తదుపరి విచారణ కోసం సచిన్ జోషిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఓం కార్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్ జోషి కూడా ఉన్నాడు. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను వీరు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి.

అంతకుముందు దాదాపు 18 గంటల పాటు సచిన్ జోషిని విచారించిన ED అధికారులు, ఆపై అరెస్ట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. గోవాలో విజయ్ మాల్యా సొంతమైన కింగ్ ఫిషర్ విల్లాను గతంలో జోషి కొనుగోలు చేశాడు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్ లు, క్లబ్ లను కలిగివున్న ప్లేబాయ్ ఫ్రాంచైజీని కూడా నిర్వహిస్తున్నాడు.

హైదరాబాద్‌ బహదూర్ పురా పోలీస్‌స్టేషన్‌లో IPC సెక్షన్‌ 336, 273 కింద గతంలో సచిన్ జోషి పై  కేసులూ నమోదయ్యాయి. అప్పటి నుండి దుబాయి లోనే ఉంటున్నాడు. లేటెస్టుగా దుబాయి నుంచి ముంబైకి వచ్చిన ఆయనను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు ప్రేక్షకులకు ఒరేయ్ పండు, మౌనమేలనోయి, జాక్ పాట్  తదితర సినిమాలతో సచిన్ జోషి సుపరిచితుడు.