సుశాంత్​ సింగ్​ పోస్టుమార్టం రిపోర్ట్

సుశాంత్​ సింగ్​ పోస్టుమార్టం రిపోర్ట్

ముంబై: బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తయింది. ఆయన మృతదేహానికి పోస్టు మార్టం చేసిన ముంబైలోని జుహు ప్రాంతం మున్సిపల్ జనరల్ ఆస్పత్రి డాక్టర్ కూపర్ సోమవారం రిపోర్టును విడుదల చేశారు. సుశాంత్​ది ఆత్మహత్యేనని ధృవీకరించారు. డెడ్​బాడీకి కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ అని నిర్ధారించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆదివారం ఉరివేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనది సూసైడ్ కాదని, ఏదో కుట్ర దాగి ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు సుశాంత్ అపార్ట్ మెంట్​లో.. డిఫ్రెషన్ కు సంబంధించిన మెడిసిన్ తప్ప మరెలాంటి ఆధారాలు కనుగొనలేదు. సుశాంత మరణం పట్ల అనుమానించేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ముంబై డీసీపీ అభిషేక్ త్రిముఖే మీడియాకు వెల్లడించారు. డిఫ్రెషన్ తోనే ఆయన చనిపోయినట్లు పోలీసులు ప్రాథమిక రిపోర్టులో తేల్చారు. తాజాగా బయటికొచ్చిన రిపోర్టు సైతం.. సుశాంత్​సింగ్ ది ఆత్మహత్యేనని కన్ఫామ్ చేసింది.

సుశాంత్ సింగ్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్, బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ బాబ్లూ, మరికొందరు కుటుంబ సభ్యులు పాట్నా నుంచి ముంబైకి బయలుదేరారు. ముంబైలోనే సుశాంత్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు.