స్క్రీన్‌‌‌‌‌‌‌‌ ప్లే హైలైట్‌‌‌‌‌‌‌‌గా మహారాజ : విజయ్ సేతుపతి

స్క్రీన్‌‌‌‌‌‌‌‌ ప్లే హైలైట్‌‌‌‌‌‌‌‌గా మహారాజ : విజయ్ సేతుపతి

వైవిధ్యమైన చిత్రాలతో విలక్షణ నటుడిగా మెప్పిస్తున్న విజయ్ సేతుపతి.. ‘మహారాజ’ చిత్రంతో కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 50వ మైల్‌‌‌‌‌‌‌‌ స్టోన్‌‌‌‌‌‌‌‌ను చేరుకున్నారు. నితిలన్ స్వామినాథన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈనెల 14న తమిళ, తెలుగు భాషల్లో సినిమా విడుదలవుతోంది.  ఈ సందర్భంగా విజయ్ సేతుపతి చెప్పిన విశేషాలు.. 

‘‘నటుడిగా యాభై సినిమాలు పూర్తవడం సంతోషం. ఈ ప్రయాణంలో దాదాపు ఐదు వందల కథలు విన్నా. ఎంతోమందిని కలిశా. విజయాలు, అపజయాలు చూశా. ఫలితం ఎలాంటిదైనా ఈ జర్నీ ఓ గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ఇప్పటివరకూ ఎన్ని పాత్రలు పోషించినా, ‘మహారాజ’లో చేసిన పాత్ర అందుకు పూర్తి డిఫరెంట్.  ఇంట్రావర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉంటూనే యాంగ్రీ మ్యాన్‌‌‌‌‌‌‌‌లా కనిపిస్తా.  

అదే సమయంలో కుటుంబాన్ని సంరక్షించుకునే పాత్ర. ఈ క్యారెక్టరైజేషనే చాలా బ్యాలెన్సింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. అలాగే కథ ఆసక్తికరంగా ఉంది. అందరికీ నచ్చుతుందనే నమ్మకంతోనే నా 50వ సినిమాగా చేశాను. నితిలన్‌‌‌‌‌‌‌‌ చాలా బాగా తీశాడు. తనకు స్క్రీన్‌‌‌‌‌‌‌‌ ప్లేపై మంచి గ్రిప్‌‌‌‌‌‌‌‌ ఉంది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది.  అందరూ చాలా బాగా నటించారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్‌‌‌‌‌‌‌‌ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.  తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది.  ఇక నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో నేను ఎక్కువ అంచనాలు పెట్టుకోను.  

డ్రీమ్స్ లాంటివి ఉంటే మనకు ఎక్కువ పెయిన్‌‌‌‌‌‌‌‌, దానికోసం ఎదురుచూపులు ఉంటాయి. దక్కకపోతే డిజప్పాయింట్ అవుతాం. అందుకే ఏదీ క్యారీ చేయను. ఇక క్యారెక్టర్స్ రోల్స్ అనేవి నా ఫ్రెండ్స్ కోసం చేశాను. దర్శకుడు బుచ్చిబాబు కోసం ‘ఉప్పెన’లో నటించా.  చిరంజీవి,  రజినీకాంత్, విజయ్, షారుక్ ఖాన్ లాంటి స్టార్స్‌‌‌‌‌‌‌‌పై ఉన్న ఇష్టంతో వాళ్లతో కలిసి నటించాను.  తెలుగులో స్ట్రయిట్‌‌‌‌‌‌‌‌ సినిమా కోసం కథలు వింటున్నా.  మంచి కథ రాగానే చేస్తాను.  ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు, ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నా’’.