బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌ లిస్ట్ లో వివేక్ ఒబెరాయ్

బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌ లిస్ట్ లో వివేక్ ఒబెరాయ్

గుజరాత్ లో ఎన్నికల ప్రచారానికి బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ని స్టార్ క్యాంపేనర్ ప్రకటించింది బీజేపీ. శుక్రవారం 40 మంది తోకూడిన నాయకుల పేర్లను ప్రకటించింది. వీరు గుజరాత్ లోని లోక్ సభ, అసెంబ్లీ స్థానాలలో బరిలో ఉన్న వారి తరపున ప్రచారంలో పాల్గొంటారు. లిస్ట్ లో ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లాంటి అగ్రనేతలు ఉన్నారు. వీరితో పాటు వివేక్ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రధాని నరేంధ్రమోడీ బయోపిక్ లో మోడీ పాత్రలో వివేక్ నటించారు. దర్శకుడు ఒమంగ్ కుమార్ తెరకెక్కించిన ‘పీఎం నరేంధ్రమోడీ’ సినిమాలో.. వివేక్ ఒబెరాయ్ తో పాటు.. బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, కిశోర్ షహానే, దర్శన్ కుమార్  నటించారు.