IPL 2026: క్రికెట్ ఫ్యాన్స్ కి శుభవార్త.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. 

IPL 2026: క్రికెట్ ఫ్యాన్స్ కి శుభవార్త.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. 

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ రోజే ఈ షెడ్యూల్ రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా షెడ్యూల్ విడుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు షెడ్యూల్ వస్తుంది? ఎందుకు ఆలస్యం అవుతోంది? అనే విషయాలను తెలియజేశారు.   

దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 12వ తేదీ లోపు ఐపీఎల్ 2026 షెడ్యూల్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మొత్తం టోర్నీ షెడ్యూల్‌ను ఒకేసారి విడుడల చేయడం లేదు.. కేవలం తొలి 20 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించనుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పటికే మొదటి విడత మ్యాచుల జాబితాను రెడీ చేసింది. మిగిలిన మ్యాచుల వివరాలను తర్వాతి ప్రకటించనున్నారు.  

►ALSO READ | Virat Kohli: టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కి హాజరు కానీ విరాట్ కోహ్లీ.. ఎందుకు రాలేదో తెలుసా..?

ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ ఆలస్యానికి ప్రధాన కారణం ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగటమే.. 2026లో పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు కొనసాగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఐపీఎల్ జట్లు ఉండటం, అక్కడ హోమ్ గ్రౌండ్ మ్యాచులు జరగాల్సి ఉండటంతో భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎలక్షన్స్ డేట్స్ కి అనుగుణంగా మ్యాచులను సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో షెడ్యూల్‌ను దశల వారీగా రిలీజ్ చేయనున్నారు. 

ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి మే 31వ తేదీ వరకు జరగనున్నట్లు తెలుస్తుంది. గతంలో మార్చి 26వ తేదీ నుంచే టోర్నీ మొదలవుతుందని ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పుడు ఆ తేదీ రెండు రోజులు వెనక్కి వెళ్ళినట్లు సమాచారం. మార్చి 12న వచ్చే షెడ్యూల్ తో తొలి మ్యాచ్ ఎవరి మధ్య ఉంటుంది? వేదికలు ఎక్కడ? జరగనున్నాయి అనే దానిపై పుల్ క్లారిటీ రానుంది.