తల్లి కాబోతున్న ఇలియానా.. మూవీ ప్రమోషన్ అయితే కాదుగా..

 తల్లి కాబోతున్న ఇలియానా.. మూవీ ప్రమోషన్ అయితే కాదుగా..

గోవా బ్యూటీ ఇలియానా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్  ద్వారా  వెల్లడించింది. నా లిటిల్ డార్లింగ్‌ను చూసేందుకు ఆతృత‌గా ఎదురుచూస్తున్నానని,  క‌మింగ్ సూన్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతున్నారు.  ఇలియానా  సడెన్‌గా  ప్రెగ్నెన్సీ విషయం బయట పెట్టడంతో కొందరు షాక్ అవుతున్నారు కూడా. 

 ఇదంతా నిజమేనా లేకపోతే ఏదైనా సినిమా ప్రమోషన్ కోసమా అని అనుమానం వ్యక్తం చేసేవాళ్లు కూడా లేకపోలేదు. ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో చాలా ఏళ్లు రిలేషన్ లో ఉంది. అతడితో బ్రేకప్ అయ్యాక బాలీవుడ్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్ లో ఉన్నట్టుగా ప్రచారం నడిచింది. 

దేవాదాస్ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఇలియానా రెండో  సినిమా పోకిరితో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో చివరగా అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో కనిపించింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఇలియానా టచ్ లోనే ఉంది. ఇక  ఇలియానా ప్రెగ్నెన్సీ విషయంపై మరింత క్లారిటీ రావలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.