ముగిసిన విజయనిర్మల అంత్యక్రియలు

ముగిసిన విజయనిర్మల అంత్యక్రియలు

సినీ నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మల అంత్యక్రియలు ముగిశాయి. చిలుకూరు సమీపంలోని విజయకృష్ణ గార్డెన్స్ లో అంత్యక్రియలను నిర్వహించారు. ఆమె కుమారుడు నరేశ్… ఆమె చితికి నిప్పంటించారు. అంతకు ముందు నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసం నుంచి ఆమె అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమెను కడసారి చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు వచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, అభిమానుల అశ్రునయనాలతో ఆమెకు తుది వీడ్కోలు పలికారు.

విజయనిర్మల అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు.