సుమన్ తో ఎవరు మాట్లాడించారో తేల్చాలి :  ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

సుమన్ తో ఎవరు మాట్లాడించారో తేల్చాలి :  ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

హైదరాబాద్, వెలుగు: సుమన్ ను అరెస్టు చేయడం కాదు.. ఆయనతో టెర్రరిస్టులా ఎవరు మాట్లాడించారో పోలీసులు తేల్చాలని విప్ అద్దంకి దయాకర్ డిమాండ్​ చేశారు. బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలో సుమన్ బలయ్యాడని ఆరోపించారు. శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దాడులు చేయాలనేది బీఆర్ఎస్ నైజమన్నారు. సుమన్​ తప్పుచేసి గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్  బతుకంతా రెచ్చగొట్టడమేనని, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుందని దుయ్యబట్టారు.