ఇరవైఏండ్ల తర్వాత కోల్ కతాకు.. వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్!

ఇరవైఏండ్ల తర్వాత కోల్ కతాకు.. వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్!

పరారీలో ఉన్న బంగ్లాదేశ్ రచయిత్రి, మానవ హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కోల్‌కతాకు తిరిగి రానున్నారు. తన రచనలతో నిరసనలు చెలరేగడంతో ఆమెను భారత్ లో బహిష్కరించడంతో విదేశాలకు పారిపోయారు. ప్రత్యేక అనుమతితో ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు.  ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆగస్టు 1న తస్లీమా కోల్ కతాకు వస్తున్నారు

ఆమె ఆత్మకథా పుస్తకం 'ద్విఖండితో' దైవదూషణ ఆరోపణలు ఉన్నాయని నిరసనలు చెలరేగడంతో 63 ఏళ్ల రచయిత్రి కోల్‌కతా నుంచి విదేశాలకు పారిపోవాల్సి వచ్చింది. అప్పటి సీపీఎం ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది. 

2026 ఆగస్టు 1న కోల్ కతాలోని రవీంద్ర సదన్‌లో మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. స్థానిక మూడు సంస్థల ఉమ్మడి ఆహ్వానం మేరకు కోల్ కతాకు రానున్నారు. 2007 తర్వాత ఆమె ఆ నగరానికి రావడం ఇదే మొదటిసారి. సీఎం  సువెందు అధికారి, ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా, రచయిత శిర్షెందు ముఖోపాధ్యాయ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 

తస్లీమా పర్యటనపై  రాజకీయ వివాదం..  

తస్లీమా నస్రీన్ బెంగాల్ రాకపై బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. తస్లీమా నస్రీన్‌ను బెంగాల్‌కు తీసుకురావాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు.. తస్లీమా నస్రీన్ గొంతును ఎందుకు అణచివేయాలి?.. బంగ్లాదేశ్‌లో ఒక హిందూ కుటుంబం ఎదుర్కొన్న అఘాయిత్యాలపై ఆమె 'లజ్జ' రాశారు..కానీ గత వామపక్ష ప్రభుత్వం ఆమె రచనను నిషేధించింది. కోల్‌కతా పర్యటనకు ఆమె రాకను మేము స్వాగతిస్తున్నాం అని భట్టాచార్య అన్నారు. బంగ్లాదేశ్‌లో నిషేధంలో ఉన్న 'లజ్జ' చిత్రం, బంగ్లాదేశీ హిందువులు ,ఇతర మత మైనారిటీలు ఎదుర్కొంటున్న అసహనం, హింసల కథను చెబుతుంది.

ఇదిలా ఉండగా, రచయిత్రి తరచుగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడారని, అందుకే 'డబుల్-ఇంజిన్ ప్రభుత్వం ఆమెను స్వాగతిస్తోందని తృణమూల్ ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్ ఆరోపించారు.