హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివాసీలు గురువారం చార్మినార్ను సందర్శించారు. వీరికి పర్యాటక శాఖ అధికారులు మంగళవాయిద్యాలు, డోలు దరువులతో తిలకం దిద్ది ఘనంగా స్వాగతం పలికారు. మొదటిసారి చార్మినార్ను చూసిన ఆదివాసీలు దాని నిర్మాణ శైలిని చూసి ఆశ్చర్యపోయారు.
విదేశీ పర్యాటకులతో కలిసి ఫొటోలు దిగారు. చార్మినార్ చారిత్రక విశిష్టతను అధికారులు వివరించగా, తమకు లభించిన ఆత్మీయ గౌరవం పట్ల ఆదివాసీ బృందం సంతోషం వ్యక్తం చేసింది.– హైదరాబాద్ సిటీ, వెలుగు

