ఆదివాసీలకు తప్పని వాగు కష్టాలు

ఆదివాసీలకు తప్పని వాగు కష్టాలు

ఆదివాసీలకు వాగులతో కష్టాలు తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో వాగు దాటలేక గర్బిణీ తీవ్ర ఇబ్బందులు పడింది. ఆదివాసీ మహిళ వాగు ఒడ్డునే ప్రసవించింది . హర్కాపూర్ కు చెందిన గాంధారికి పురిటి నొప్పులు రావడంతో ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు  కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే మాబిడిగూడ వాగు ఉధృతి పెరగడంతో వాగు దాటేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. దీంతో మహిళ వాగు ఒడ్డునే ప్రసవించింది. పిట్టబొంగరం వైద్య సిబ్బంది వాగు దాటి మహిళ దగ్గరకి వెళ్లారు. స్థానికుల సహాయంతో తల్లి బిడ్డలను హాస్పిటల్ కి తరలించారు వైద్య సిబ్బంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.