నవంబర్ 14 నుంచి డిపార్ట్ మెంటల్ పరీక్షలు

నవంబర్ 14 నుంచి డిపార్ట్ మెంటల్ పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు, సర్వీస్ నిబంధనలకు సంబంధించిన డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంటల్ టెస్ట్స్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రెటరీ హరిత నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హులైన ఉద్యోగుల నుంచి కమిషన్ అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ www.tgpsc.gov.in ద్వారా ఈ నెల 26 నుంచి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. 

అప్లికేషన్లు వచ్చే నెల 17 సాయంత్రం 5గంటల వరకు చేసుకోవచ్చు. నవంబర్ 14 నుంచి 23 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. లాంగ్వేజ్, సర్వే పరీక్షలు రాతపూర్వక పద్ధతిలో ఉంటాయి. ప్రతి టెస్టుకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.వెయ్యి, ఒక్కో పేపర్‌‌‌‌‌‌‌‌కు పరీక్ష ఫీజుగా రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.