భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కల్తీ కల్లు అమ్మి నలుగురి మృతికి కారణమైన వ్యక్తికి కొత్తగూడెం అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఆడేపు నీరజ రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు నిచ్చారు. ఇల్లెందు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన 14 మంది 2013 జనవరిలో కంబంపాటి రామయ్య దుకాణంలో కల్లు తాగారు. వారిలో పలువురు వాంతులు, విరేచనాలకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
ఇందులో కల్తీ స్వామి, మూడ్ సాయి. భానోత్ లింబ్రా, బానోత్ బిక్ష ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. ఈ మేరకు కొమరారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో రామయ్యకు రెండేండ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి ఫైన్ వేస్తూ జడ్పీ తీర్పు నిచ్చారు. పీవీడీ లక్ష్మి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. లైజన్ ఆఫీసర్గా హరిగోపాల్ వ్యవహరించారు.
