నిమ్స్‌‌లో ఆంకాలజీ వార్డును ప్రారంభించిన మంత్రి ఈటెల

నిమ్స్‌‌లో ఆంకాలజీ వార్డును ప్రారంభించిన మంత్రి ఈటెల

పంజాగుట్ట: నిమ్స్‌‌లో క్యాన్సర్ రోగులకు ఇకపై ఆధునిక వైద్యం అందుబాటులో ఉండనుంది. నిమ్స్‌‌లో రూ. 18 కోట్లతో ఎంఈఐఎల్ నిర్మించిన క్యాన్సర్ విభాగాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీ, అత్యాధునిక సౌకర్యాలతో నిమ్స్‌లో ఆంకాలజీ వార్డును మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాటు చేసింది. 50 పడకలతో క్యాన్సర్ పేషెంట్‌‌ల చికిత్సకు ప్రత్యేక వార్డులు, పిల్లల క్యాన్సర్, లుకేమియా రోగుల చికిత్స కోసం అధునాతన వార్డులను ఏర్పాటు చేసింది. పేషెంట్లకు అనుక్షణం సేవలందించేందుకు వార్డుల్లోనే నర్సింగ్ స్టేషన్లు.. మహిళలు, పురుషులు, చిన్న పిల్లలకు ప్రత్యేక వార్డులు అందుబాటులోకి వచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌‌బిలిటీ (సీఎస్ఎఆర్)లో భాగంగా నిమ్స్‌‌లో ఎంఈఐఎల్ ఈ సేవలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. కార్యక్రమంలో మేఘా ఇంజినీరింగ్ సంస్థ చైర్మన్ పిచ్చిరెడ్డి, డైరెక్టర్ సుధారెడ్డి హాజరయ్యారు.