
సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో అత్యవసర సమయంలో పరిస్థితులను ఎదుర్కోవడానికి క్విక్ రెస్పాన్స్ బృందానికి సెక్యూరిటీ ఫర్ సైబర్ కౌన్సిల్ వారు రెండు అత్యాధునిక స్కార్పియో వాహనాలను సైబరాబాద్ పోలీసులకు అందజేశారు. మంగళవారం సైబరాబాద్ సీపీ వీసీ. సజ్జనార్ కమిషనరేట్లో వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఐటీ కారిడార్‌లో ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే ఈ క్విక్ రెస్పాన్స్ టీం అక్కడకు వెళ్లి సమస్యను పరిష్కరించేలా టెక్నాలజీతో ఈ వాహనాలను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ యేదుల, వైస్ చైర్మన్ భరణికుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, డీసీపీ అనసూయ, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.