అడ్వకేట్లను ముట్టుకోవాలంటేనే భయపడాలి..అడ్వకేట్స్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ యాక్ట్ తేవాల్సిందే.. 

అడ్వకేట్లను ముట్టుకోవాలంటేనే భయపడాలి..అడ్వకేట్స్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ యాక్ట్ తేవాల్సిందే.. 
  • లేకపోతే ఆందోళనలకు దిగుతాం ..హైకోర్టు అడ్వకేట్​రాపోలు భాస్కర్​

మలక్‌‌‌‌పేట, వెలుగు : రాష్ట్రంలో అడ్వకేట్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ లేకపోవడం వల్ల న్యాయవాదులపై విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారని, చట్టం వస్తే అడ్వకేట్లను ముట్టుకోవాలంటనే భయపడతారని హైకోర్ట్ సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ అన్నారు. గురువారం సైదాబాద్‌‌‌‌లోని తన ఆఫీసులో పలువురు మహిళా న్యాయవాదులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 

మహిళా న్యాయవాది స్వప్న హత్య న్యాయవాదులందరినీ ఆందోళనకు గురి చేస్తోందని, ఆ కేసు విచారణకు ఫాస్ట్‌‌‌‌ ట్రాక్‌‌‌‌ కోర్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో పెద్దపల్లి జిల్లాలో న్యాయవాది వామనరావు, నాగమణి దంపతులు, న్యాయవాదులు మల్లారెడ్డి దశరథ, ఇజ్రాయెల్​సైతం దారుణ హత్యకు గురయ్యారని గుర్తు చేశారు.

అడ్వకేట్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ లేకపోవడం వల్లే ఎవరిలోనూ భయం లేకుండా పోతోందన్నారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి స్పందించి చట్టం తీసుకురావాలని, లేకపోతే న్యాయవాదులమంతా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళలనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో మహిళా న్యాయవాదులు పద్మ, రవళి, రమ్య పాల్గొన్నారు.