సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కిలో మీటరుకు 20 పైసల చొప్పున ప్రయాణికులపై భారం పడనుంది. ఇకపై పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో మినిమం టికెట్ రూ.10 వసూలు చేయనుంది ఆర్టీసీ. అంతేకాదు సబ్సిడీ బస్ పాసులపై కూడా వడ్డనకు నిర్ణయం తీసుకుంది సంస్థ. దీంతో విద్యార్థులతో పాటు నిత్యం సిటీ బస్సు పాసులు వాడే వారిపైనా భారం పడుతోంది. పాసులతో ప్రయాణించే వారికి కొట్టే కాంబినేషన్ టికెట్ ధరను మాత్రం యథావిధిగా రూ.10గానే ఉంచారు. అయితే సిటీ బస్సుల్లో 24 గంటల పాటు తిరగడానికి వీలుగా ఇచ్చే డే పాస్‌ను రూ.80 నుంచి 100కు పెంచింది ఆర్టీసీ
వివిధ పాసుల చార్జీల పెంపు ఇలా..
పాత చార్జీ పెంపు తర్వాత చార్జీ
సామాన్యుల పాస్
సిటీ ఆర్డినరీ బస్సు రూ.770 రూ.950
మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.880 రూ.1070
మెట్రో డీలక్స్ రూ.990 రూ.1185
MORE NEWS:
సమ్మె విరమణ తర్వాత.. ఆర్టీసీ కార్మికుల భేటీలో సీఎం కేసీఆర్ వరాల జల్లు
ఆర్టీసీ బస్సు చార్జీల వడ్డన.. కొత్త టికెట్ రేట్లు ఇవీ
ఎన్జీవోల పాస్
సిటీ ఆర్డినరీ రూ.260 రూ.320
మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.370 రూ.450
మెట్రో డీలక్స్ రూ.480 రూ.575
స్టూడెంట్స్ పాసులు సిటీలో..
నెలవారీ రూ.130 రూ.165
మూడు నెలల పాస్ రూ.390 రూ.495
ఐదో తరగతి లోపు పిల్లలకు మూడు నెలల పాసు (సిటీ/జిల్లాలు)
4 కిలోమీటర్ల వరకు రూ.130 రూ.165
8 కిలోమీటర్ల వరకు రూ.160 రూ.200
12 కిలోమీటర్ల వరకు రూ.195 రూ.245
18 కిలోమీటర్ల వరకు రూ.225 రూ.280
22 కిలోమీటర్ల వరకు రూ.265 రూ.330
హైస్కూల్, కాలేజీ విద్యార్థుల మూడు నెలల పాసు (జిల్లాలు)
5 కిలోమీటర్ల వరకు రూ.235 రూ.310
10 కిలోమీటర్ల వరకు రూ.315 రూ.415
15 కిలోమీటర్ల వరకు రూ.385 రూ.510
20 కిలోమీటర్ల వరకు రూ.510 రూ.675
25 కిలోమీటర్ల వరకు రూ.645 రూ.850
30 కిలోమీటర్ల వరకు రూ.705 రూ.930
35 కిలోమీటర్ల వరకు రూ.775 రూ.1025
హైస్కూల్, కాలేజీ విద్యార్థుల నెల వారీ పాసు (జిల్లాలు)
5 కిలోమీటర్ల వరకు రూ.85 రూ.115
10 కిలోమీటర్ల వరకు రూ.105 రూ.140
15 కిలోమీటర్ల వరకు రూ.135 రూ.180
20 కిలోమీటర్ల వరకు రూ.180 రూ.240
25 కిలోమీటర్ల వరకు రూ.225 రూ.300
30 కిలోమీటర్ల వరకు రూ.250 రూ.330
35 కిలోమీటర్ల వరకు రూ.270 రూ.355

