ఫార్మాసిటీని ప్రభుత్వం రద్దు చేయాలని బాధిత రైతుల డిమాండ్

ఫార్మాసిటీని ప్రభుత్వం రద్దు చేయాలని బాధిత రైతుల డిమాండ్

ఎల్బీ నగర్, వెలుగు: ఫార్మా సిటీని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ధ గ్రామాల నిర్వాసిత రైతులు మంగళవారం పాదయాత్ర చేపట్టారు. మేడిపల్లి నుంచి తుర్కయాంజాల్​ఆర్డీవో ఆఫీసు వరకు రెండ్రోజుల పాదయాత్రలో భాగంగా మొదటిరోజు ఇబ్రహీంపట్నం వరకు చేరుకున్నారు.

రైతులు మాట్లాడుతూ ఫార్మా సిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ఆన్‌‌‌‌లైన్ పహానీలో రైతుల పేర్లు నమోదు చేయాలని, ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, బాధిత రైతులకు రైతు బంధు అమలు చేయాలన్నారు. ఈ యాత్రలో వందల సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.