రఘనందన్ రావుకు మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్

రఘనందన్ రావుకు మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తనపై చేసిన ఆరోపణలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే రఘునందన్ రావు తనపై ఆరోపణలు చేశారన్నారు.  తన స్వగ్రామంలో ఉన్న భూములు 2014, 2018 ఎలక్షన్ అఫిడవిట్ లో పేర్కొన్నవేనన్నారు. తన పిల్లల కష్టార్జీతంతో  కొన్న భూములన్నారు. రఘునందన్ రావు పరిస్థితి  కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని ఎద్దేవా చేశారు. న్యాయంగా, చట్ట ప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను తన పిల్లలు వదిలేస్తారన్నారు. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.  లేకుంటే అసత్య ఆరోపణలు చేసిన రఘునందన్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. రఘునందన్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని  కబ్జాచేసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫాంహౌజ్ కట్టారని రఘునందన్ రావు ఆరోపించారు.. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 160 ఎకరాల్లో  ఫాంహౌజ్ నిర్మించారని  తెలిపారు.  80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని 160 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టుకున్నారని ఆరోపించారు.   కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కూడా కట్టారని తెలిపారు. వీటిపై సీఎం కేసీఆర్ యాక్షన్ తీసుకోవాలన్నారు.