పిట్ట దెబ్బకు..జెట్‌‌ కూలింది..

పిట్ట దెబ్బకు..జెట్‌‌ కూలింది..

ఇండియన్‌‌ ఎయిర్‌‌ఫోర్స్‌‌కు చెందిన ఫైటర్‌‌ జెట్‌‌ ఫ్లైట్‌‌ గాల్లో ఎగురుతుండగా దాన్ని  చిన్న పిట్టొకటి గుద్దేసింది. ప్రమాదాన్ని  పైలెట్‌‌ పసిగట్టాడు.
కింద చూస్తే రెసిడెన్షియల్‌‌ ఏరియా. సమయస్ఫూర్తితో ఫ్యూయల్‌‌ ట్యాంక్‌‌, ప్రాక్టీస్‌‌ బాంబుల్ని కిందకు పడేశాడు. జెట్‌‌ సేఫ్‌‌గా ఎయిర్‌‌బేస్‌‌లో
ల్యాండ్‌‌ అయ్యేలా  చేశాడు.  హర్యానాలోని అంబాలాలో గురువారం ఈ సంఘటన జరిగింది. పైలెట్‌‌  అలర్ట్‌‌ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
జనాలున్న ప్రాంతాల్లో ప్రమాదం పొంచిఉన్నప్పుడు పైలెట్లు ఇలా చిన్న బాంబులు, ఎక్స్‌‌టర్నల్‌‌ ఫూయల్‌‌ ట్యాంకులు కిందకు పడేస్తారని
ఎయిర్‌‌ఫోర్స్‌‌ వర్గాలు చెప్పాయి. జెట్‌‌ శకలాలను జాగ్రత్తగా ఎయిర్‌‌ఫోర్స్‌‌ సిబ్బంది ఎయిర్‌‌బేస్‌‌కు తరలించారు.