శ్రీనగర్: అధికారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫ రెన్స్ (ఎన్సీ) ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా ఆరో పించారు. భవిష్యత్తులో ఆయన అధికారంలో లేకపోయినా దేశం మనుగడ సాగిస్తుందనే విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుంచుకోవాలని సూచించారు. బుధవారం దక్షిణ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ లో విలేకర్లతో ఆయన మాట్లా డారు. ‘‘ మనం కలిసి జీవించాలి. మెరుగైన భవిష్యత్తు కోసం అందరం కలిసి పని చేయా లి. ప్రధాని మోదీ మాత్రం అధికారంలో ఉం డటం కోసం దేశాన్ని విభజించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆయన అధికారంలో లేకపోయి నప్పటికి దేశం మనుగడ సాగిస్తుంది. నేను మత రాజకీయాలు చేయడం లేదు. ఏ మతం కూడా చెడ్డది కాదు. చెడ్డవారు మాత్ర మే దానిని చెడుగా ఉపయోగిస్తారు. రాము డు హిందువులకు మాత్రమే చెందినవాడు కాదు. ఆయన ప్రపంచం మొత్తానికి రాముడు. ఆయన అందరికి చెందినవాడు” అని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.