
ఖమ్మం: భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఎక్సైజ్ స్టేషన్లలో పలు కేసుల్లో పట్టుకున్న 664 కేజీల గంజాయిని సోమవారం దహనం చేశారు. కాంట్రా బ్యాండ్ డిస్పోజల్ అధికారి ఖమ్మం జిల్లా డిప్యూటి కమిషనర్ జనార్ధన్ రెడ్డి అదేశాల మేరకు ఎక్సైజ్ స్టేషన్ హౌజ్ అధికారులు వారి వద్ద వివిధ కేసుల్లో నిల్వ ఉన్న గంజాయిని తీసుక వచ్చి తల్లేడ మండలం గోపాల్‌పేటలో ఉన్న ప్రభుత్వ అమోదిత AWM కన్సటింగ్ లిమిటెడ్‌లో దహనం చేశారు. దహనం చేసిన 664 కేజీల గంజాయి విలువ రూ. 3.32 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.
2025 జనవరిలో కూడా ఇదే తరహాలో గంజాయిని కాల్చేశారు. ఖమ్మం, మధిర, నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 91 కేసుల్లో పట్టుబడిన 831 కేజీల గంజాయి, 11గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను అధికారులు కాల్చేశారు. సోమవారం తల్లాడ మండలం గోపాల పేట సమీపంలోని ప్రభుత్వ అమోదిత పొందిన ఏ డబ్ల్యు ఎం కన్సల్టింగ్ లిమిటెడ్‌లో డిస్పోజల్ అధికారి ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు కోట్ల విలువ చేసే గంజాయి, డ్రగ్స్ను కాల్చారు.