వీసా హోల్డర్లకు షాకింగ్ న్యూస్.. అలా చేస్తే ఏ క్షణంలోనైనా visa రద్దు చేసే ఛాన్స్ !

వీసా హోల్డర్లకు షాకింగ్ న్యూస్.. అలా చేస్తే ఏ క్షణంలోనైనా visa రద్దు చేసే ఛాన్స్ !

వీసా హోల్డర్లకు అమెరికా ఎంబసీ షాకింగ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థులకు వీసా మంజూరైనప్పటికీ ఏ క్షణంలోనైనా రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. ఇక నుంచి వీసా వచ్చినప్పటికీ.. మధ్యలో ఎప్పుడైనా క్యాన్సిల్ చేసే  ఛాన్స్ ఉంటుందని బాంబు పేల్చింది. 

ఇండియాలో ఉన్న యూఎస్ ఎంబసీ సోమవారం (జులై 14) ఎక్స్ లో ఈ ప్రకటన పోస్ట్ చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘించినా.. ఇమ్మిగ్రేషన్స్ రూల్స్ అతిక్రమించినా విసా రద్దు చేస్తామని హెచ్చరించింది. అంతేకాకుండా తమతమ సొంత దేశాలకు నిర్దాక్షిణ్యంగా సాగనంపుతామని తెలిపింది. 

ఇమ్మిగ్రెంట్స్ విసా పొందటంతోనే పని పూర్తికాదని  యూఎస్ ఎంబసీ తెలిపింది. విసా వెరిఫికేషన్ ముందు చేసే స్క్రీనింగ్ ఇకనుంచి తర్వాత కూడా ఉంటుందని పేర్కొంది. విసా హోల్డర్లు చట్టాలను అతిక్రమిస్తున్నారా లేక ఇమ్మిగ్రేషన్ రూల్స్ అతిక్రమిస్తున్నారా అనే కోణంలో ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేస్తుంటామని తెలిపింది. 

►ALSO READ | ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‎పై 6.7 తీవ్రత నమోదు

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా.. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ను పంపే క్రమంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విసా హోల్డర్లు ఏ చిన్న పొరపాటు చేసినా తమ సొంత దేశాలకు పంపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

సోషల్ మీడియా స్క్రూటినీ:

 అమెరికా వెళ్లేందుకు F, M లేదా J విసా కొరకు అప్లై చేసుకునే వాళ్లు సోషల్ మీడియా అకౌంట్లలో చేంజెస్ చేసుకోవాలని యూఎస్ ఎంబసీ గతంలోనే సూచించింది. విసా పర్మిషన్ రావాలంటే తప్పనిసరిగా సోషల్ మీడియా సెట్టింగ్స్ ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ కు మార్చుకవాల్సి ఉంటుందని జూన్ 23న ఆదేశించిన విషయం తెలిపిందే. దానికి కొనసాగింపుగా విసా స్క్రీనింగ్ వెరిఫికేషన్ తో పాటు విసా మంజూరైన తర్వాత కూడా ఉంటుందని లేటెస్ట్ గా ప్రకటించింది. 

సోషల్ మీడియా సెట్టింగ్స్ లో పబ్లిక్ కు మార్చుకోవడం వలన అభ్యర్థుల ఐడెంటిటీ ఈజీగా తెలుసుకోవచ్చునని, అమెరికా చట్టాల ప్రకారం వారికి యూఎస్ లోకి ప్రవేశం కల్పించాలా వద్దా అని సులువుగా నిర్ధారించవచ్చునని ఎంబసీ అధికారులు తెలిపారు.

యూఎస్ వీసా కోసం అప్లై చేసుకుంటున్న అభ్యర్థులకు ఇటువంటి నిబంధనలు విధించడం కొత్తేం కాదు. 2019 నుంచి అప్లికెంట్స్ విసా ఫామ్ పైన తమ సోషల్ మీడియా యూజర్ నేమ్ ఇవ్వాలనే నిబంధన విధించింది. ఇమ్మిగ్రెంట్స్, నాన్ ఇమ్మిగ్రెంట్స్ అందరికీ ఈ రూల్ వర్తిస్తుంది. 

ఈ ఇన్ఫర్మేషన్  విసా అప్లికేషన్ చెకింగ్, స్క్రీనింగ్ కు ఉపయోగపడుతుందని ఎంబసీ తెలిపింది. అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్స్ సమాచారం ఆధారంగా.. యూఎస్ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందా అనే కోణంలో విసా ఫామ్ ను పరిశీలిస్తారు. 

ప్రతి విసా అప్లికేషన్ ను జాతీయ భద్రత కోణంలోనే చూస్తామని.. ఇది బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ కోసం బాగా ఉపయోగపడుతుందని ఎంబసీ కార్యాలయం  వివరణ  ఇచ్చింది.  దీనికి కొనసాగింపుగా విసా స్క్రీనింగ్ వెరిఫికేషన్ తో పాటు విసా మంజూరైన తర్వాత కూడా ఉంటుందని లేటెస్ట్ గా ప్రకటించడం గమనార్హం.