
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్ భార్య అనితా సింగ్ ఇండియన్ రైల్వే నడుపుతున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో అందించే భోజనం నాణ్యతపై విమర్శలు కురిపించారు. సోషల్ మీడియా Xలో న్యూఢిల్లీ నుండి లక్నోకు ప్రయాణిస్తున్న ఆమె, రైల్లో అందిస్తున్న భోజన నాణ్యత లోపాలను ఎత్తి చూపారు.
అనితా సింగ్ చేసిన పోస్ట్‌లో భోజనం ఫోటోను షేర్ చేస్తూ "రోటీ పాప్డం లాగా గట్టిగా ఉంది, పనీర్ ఫ్రెష్ లేదు, పప్పు నీళ్లల ఉంది. ఇదేనా 'ప్రపంచ స్థాయి' రైల్వే సర్వీస్ ? ప్రయాణీకుల ఆరోగ్యంతో ఆడుకోవడం ఆపేయండి " అంటూ పోస్ట్ చేసారు.
స్పందించిన IRCTC: ఈ పోస్ట్ పై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( IRCTC ) వెంటనే స్పందిస్తూ భోజనం అందించే ముందు నాణ్యత చెక్ చేస్తారని, ఈ విషయంలో మీరు ఉన్న కోచ్లోని ఇతర ప్రయాణీకులు ఎవరు ఫిర్యాదులు చేయలేదని చెబుతూ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా ఎప్పటిలాగే క్యాటరింగ్ పై ప్రశంసించారు అని పేర్కొంది.
క్యాటరింగ్ టీమ్ మీకు ఇచ్చిన భోజనాన్నీ తిరిగి తీసుకొని మరో భోజనం ఇచ్చింది. అలాగే మీ అభిప్రాయాన్ని మేము చాలా సీరియస్‌గా తీసుకున్నాం అని IRCTC అధికారిక ప్రకటనలో తెలిపింది. నాణ్యత, ప్రమాణాలను ఇంకా పెంచడానికి ఒక సీనియర్ అధికారిని నియమించామని కూడా పేర్కొంది.
PNR No 2338310371
— Anita Singh (@AnitaSingh_) July 11, 2025
तेजस एक्सप्रेस में मिला खाना बेहद घटिया था। रोटी पापड़ जैसी सख्त, पनीर बासी और दाल की जगह सिर्फ़ पानी परोसा गया।
क्या यही है रेलवे की “वर्ल्ड क्लास” सेवा? यात्रियों की सेहत से खिलवाड़ बंद हो!
माननीय @AshwiniVaishnaw जी, कृपया संज्ञान लें।@RailMinIndia pic.twitter.com/v0t0bbwwWE
సోషల్ మీడియాలో స్పందనలు: ఈ సంఘటన ఆన్ లైన్లో రకరాల స్పందనలకి దారితీసింది. రైళ్లలో భోజన నాణ్యత గురించి కొంతమంది నెటిజన్లు ఇలాంటి ఫిర్యాదులను చెప్పుకోగా, మరికొందరు IRCTCని సమర్థించారు ఇంకా తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో వారి సర్వీసుని ప్రశంసించారు. అయితే, చాలా మంది రైల్వే అధికారుల స్పందనపై అసహనం వ్యక్తం చేస్తూ, రైల్వే కోచ్‌లలో ఇంకా ప్రయాణా సమయంలో భోజన నాణ్యత పాటించకపోవడం ఏంటి అని ప్రశ్నించారు.
Also Read:-తిరుపతి రైల్వేస్టేషన్ లో రైలు బోగీలో మంటలు
మీరు ఇచ్చిన సమాధానం మీ సర్వీస్ పట్ల మీకు ఎంత శ్రద్ధ ఉందో చూపిస్తుంది. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం మానేసి మీ సర్వీస్ మెరుగుపరచుకోవడానికి కస్టమర్ ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోండి. రైళ్లలో క్యాటరింగ్ సిబ్బంది చేస్తున్న అవినీతి గురించి అందరికీ తెలుసు అంటూ ఒక కస్టమర్ విమర్శించారు.
తేజస్ ఎక్స్‌ప్రెస్ అనేది ఆధునిక సౌకర్యాలు, రైలులో భోజనంతో సహా మెరుగైన సేవలను అందించే హై-ఎండ్, సెమీ-హై-స్పీడ్ రైలుగా పేరు పొందింది. కానీ ప్రయాణికుల ఈ స్పందనలు IRCTC క్యాటరింగ్ సేవల నాణ్యతపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తున్నాయి.