ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను సక్సెస్ చేయాలి: నాగర్కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను సక్సెస్ చేయాలి: నాగర్కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాలో మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు ప్రభుత్వం నిర్వహించనున్న 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నాగర్​కర్నూల్​ కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌లో అడిషనల్​ కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, అడిషనల్​ ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా చూడాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

తాడూరు ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ  

నాగర్​కర్నూల్​కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం తాడూరులోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, విద్యార్థుల సౌకర్యాలు,  బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాలలో మొత్తం 6,125 మంది విద్యార్థులకు గాను 5936 మంది హాజరయ్యారని, 189 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. అనంతరం ఆయన తాడూరు పీహెచ్​సీని తనిఖీ చేసి, అవుట్ పేషెంట్ విభాగం, ప్రసూతి గది ఔషధ నిల్వలను పరిశీలించారు.