సోషల్ మీడియాలో హైదరాబాద్ Vs బెంగళూరుపై చర్చ : ఇక బెంగళూరును వదిలేయాల్సిందేనా..!

సోషల్ మీడియాలో హైదరాబాద్ Vs బెంగళూరుపై చర్చ : ఇక బెంగళూరును వదిలేయాల్సిందేనా..!

Hyderabad Vs Bengaluru: ఇటీవలి కాలంలో బెంగళూరులో నివసిస్తున్న ప్రజలు అక్కడి కష్టాల గురించి తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెరిగిపోతున్నాయి. ఇండియన్ సిలికాన్ వ్యాలీలో రోడ్ల నుంచి ట్రాఫిక్స్ జామ్స్ వరకు ఏవీ మారటం లేదని, ఏళ్లు గడుస్తున్నా తమ కష్టాలు పరిష్కరింపబడటం లేదని చాలా మంది చెబుతున్నారు.

ఇటీవల కర్ణాటక ప్రభుత్వం బైక్ టాక్సీలను నిలిపివేయటంతో రోడ్ల మీద ట్రాఫిక్ కష్టాలు మరింతగా పెరిగాయని చాలా మంది అంటున్నారు. దీంతో పరిష్కరింపబడని ట్రాఫిక్ కష్టాలతో తాము పట్టపగలే చుక్కలు చూస్తున్నామని అంటున్నారు. ఇప్పటికే మెట్రో నిర్మాణం ఆలస్యం, రోడ్లపై డైవర్షన్స్ తమకి యుద్ధంలా మారాయని అంటున్నారు. ఈ క్రమంలోనే రే అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఒకప్పుడు 40 నిమిషాల్లో ఆఫీసుకు వెళ్లేవాడినని.. కానీ నగరంలో డైవర్షన్స్ వల్ల ఇది కాస్తా గంట 50 నిమిషాలు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

 

ట్రాఫిక్ డైవర్షన్లు రొటీన్ అలాగే శాశ్వతంగా మారటంతో రద్దీ బెంగళూరు రోడ్లపై ప్రయాణం నరకంగా మారిందని చెప్పుకొచ్చాడు. ఇదంతా చూస్తుంటే ఇక బెంగళూరు నగరాన్ని విడిచి వేరే నగరానికి వెళ్లాల్సిన సమయం వచ్చేసిందని చెప్పాడు. రానున్న ఏడాది కాలంలో తాను హైదరాబాద్ వెళ్లిపోతున్నానని.. ఏడాదిలో కేవలం 3 నెలలో అక్కడ ఎండలు ఉంటాయని చెప్పాడు. కొంచెం అటూఇటుగా వాతావరణం బెంగళూరు మాదిరిగానే హైదరాబాదులో ఉండటంతో పెద్ద మార్పు కనిపించదని అభిప్రాయపడ్డాడు. 

Also Read : బిట్స్ పిలానీ విస్తరణకు రూ.2వేల 200 కోట్లు.. అమరావతిలో AI+ క్యాంపస్

అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ కొనసాగుతోంది. ఒక యూజర్ స్పందిస్తూ కేవలం 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న కార్యక్రమానికి చేరుకోవటానికి తనకు 90 నిమిషాలు సమయం పట్టిందని బెంగళూరు ట్రాఫిక్ కష్టాల గురించి చెప్పాడు. మరో యూజర్ ఈ రోజుల్లో బెంగళూరు మరీ రద్దీగా మారిందని దీనిని అక్కడి ప్రజలు భరించలేని స్థితికి చేరిందన్నారు. మరో యూజర్ హైదరాబాద్ కూడా ప్రస్తుతం ఇరుకుగా మారిపోయిందని చెప్పారు. హైదరాబాదులో ప్రస్తుతం ఓఆర్ఆర్ చుట్టుపక్కల నివాసం సేఫ్ అని, దీని వల్ల నగరంలో ఎక్కడికైనా వెళ్లటానికి వీలుంటుందని చెప్పారు. 

హైదరాబాదులో ట్రాఫిక్ కష్టాల్లో ఇరుక్కోకుండా ఉండాలంటే ఉదయం 8 గంటల కంటే ముందే ఆఫీసులకు స్టార్ట్ కావటం మంచిదని ఒక యూజర్ చెప్పారు. ఇక హైదరాబాదులో తరగతుల వారీగా వ్యత్యాసం ఉన్నందున మంచి గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఎంపిక బెటర్ అని సదరు యూజర్ చెప్పుకొచ్చారు.