బిట్స్ పిలానీ విస్తరణకు రూ.2వేల 200 కోట్లు.. అమరావతిలో AI+ క్యాంపస్

బిట్స్ పిలానీ విస్తరణకు రూ.2వేల 200 కోట్లు.. అమరావతిలో AI+ క్యాంపస్

BITS Pilani Amaravati: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రస్తుతం బిట్స్ పిలానీ సంస్థకు చాన్స్‌లర్ గా కూడా వ్యవహరిస్తు్న్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సంస్థ కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని అలాగే ఏఐ టెక్నాలజీ వినియోగం, ఎడ్ టెక్ పరిశ్రమలోకి ఎంట్రీకి సంబంధించిన కీలక విషయాలపై ఆదివారం ప్రకటన చేశారు.

ఇందులో భాగంగా బిట్స్ పిలానీ విస్తరణ కోసం రూ.2వేల 200 కోట్లను వినియోగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ముందుగా రూ.వెయ్యి 200 కోట్లను బిట్స్ పిలానీ హైదరాబాద్, గోవా క్యాంపస్ ల విస్తరణ కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు. ఈ మెుత్తాన్ని ఆయా క్యాంపస లలో రీసెర్చ్ బ్లాక్స్, హాస్టళ్లు, ఫ్యాకల్టీకి నివాసాలు వంటివి ఏర్పాటుకు వాడతామన్నారు. దీని ద్వారా అక్కడి విద్యార్థుల సంఖ్యను 18వేల 700 నుంచి 26వేలకు పెంచాలని రానున్న ఐదేళ్లలో పెంచనున్నట్లు చెప్పారు.

ఇక రెండవ ప్రణాళికలో భాగంగా రూ.వెయ్యి కోట్లతో ఏఐ ప్లస్ క్యాంపస్ ను ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో ఏర్పాటుకు వినియోగించాలని నిర్ణయించినట్లు కుమార మంగళం బిర్లా చెప్పారు. ఈ క్యాంపస్ భవిష్యత్ టెక్నాలజీల అవసరాలకు అనుగుణంగా ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ షిజికల్ సిస్టమ్స్ వంటి సాంకేతికలకు కేంద్రంగా మార్చనున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్ డీ, ఇంటర్న్ షిప్, జాయింట్ డిగ్రీ వంటివి అమరావతి క్యాంపస్ లో ఉండనున్నట్లు చెప్పారు. 7వేల మంది విద్యార్థులకు నిలయంగా దీనిని తీర్చిదిద్దుతామని బిర్లా చెప్పారు. 

ALSO READ : IPO News: అడుగుపెట్టగానే ఐపీవో 45% లాభాలు.. మార్కెట్ల పతంలోనూ సూపర్ లిస్టింగ్..

ఇక తాజా ప్రణాళికలో భాగంగా బిట్స్ పిలానీ డిజిటల్, ఎడ్ టెక్ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ ఫ్లాట్ ఫారమ్ మెుత్తం 11 డిగ్రీలతో పాటు 21 సర్టిఫికేషన్ కోర్సులను అందించనుందని చెప్పారు.