IPO News: అడుగుపెట్టగానే ఐపీవో 45% లాభాలు.. మార్కెట్ల పతంలోనూ సూపర్ లిస్టింగ్..

IPO News: అడుగుపెట్టగానే ఐపీవో 45% లాభాలు.. మార్కెట్ల పతంలోనూ సూపర్ లిస్టింగ్..

Smarten Power Systems IPO: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు పతనంలో కొనసాగుతున్నప్పటికీ లిస్టింగ్ అయిన ఐపీవో మాత్రం బెట్ వేసిన ఇన్వెస్టర్లకు కనవర్షం కురిపించింది. చాలా కాలం తర్వాత మళ్లీ మార్కెట్లలో వరుస ఐపీవోల రాక కళకళలాడేలా చేస్తోంది. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్మార్టెన్ పవర్ సిస్టమ్స్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో నుంచి 44 శాతం ప్రీమియం ధరతో ఒక్కోటి రూ.144 రేటు వద్ద ఎన్ఎస్ఈలో జాబితా అయ్యాయి. దీంతో గ్రేమార్కెట్లో చూపిన 15 శాతం ప్రీమియం కంటే రెండింతలు ఎక్కువ రేటుకు స్టాక్స్ లిస్టింగ్ జరిగింది. దీంతో ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు. వాస్తవానికి కంపెనీ తన షేర్లను ఒక్కోటి రూ.100 గరిష్ఠ రేటుకు ఇష్యూ సమయంలో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. 

కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.50 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం కంపెనీ 40 లక్షల తాజా ఈక్విటీ షేర్లతో పాటు మిగిలిన వాటాలను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో అమ్మకానికి పెట్టింది. ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ కోసం జూలై 7 నుంచి జూలై 9 వరకు అందుబాటులో ఉంచబడింది. ఈ క్రమంలో కంపెనీ తన లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించటంతో పెట్టుబడిదారులు కనీసం లక్ష 20వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. 

ALSO READ : అంతర్జాతీయ స్థాయికి హైదరాబాద్ కంపెనీ.. తాజాగా వియత్నాంలో ..

కంపెనీ వ్యాపారం.. 
2014లో స్థాపించబడిన కంపెనీ పవర్ బ్యాకప్ సిస్టమ్స్ డిజైన్, తయారీలో ఉంది. దీనికి తోడు కంపెనీ సోలార్ ఉత్పత్తుల విక్రయంలో కూడా అండుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే ఇళ్లకు, ఆఫీసులకు సోలార్ ఇన్వెర్టర్లు, యూపీఎస్ ఇన్వర్టర్లు, సోలార్ ప్యానెల్స్, బ్యాటరీల తయారీ విక్రయంలో ఉంది. ప్రస్తుతం కంపెనీ తన వ్యాపాన్ని ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాలకు విస్తరించింది. దేశంలో 382 డిస్ట్రిబ్యూటర్లతో పాటు 52 సర్వీస్ సెంటర్లతో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.