
గడచిన కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ సంస్థలు దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపారవేత్తల దూరదృష్టి దీనికి ప్రధాన కారణంగా ఉంది. ప్రపంచ స్థాయి సంస్థలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతున్న వేళ ఇక్కడి సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరణకు వెళ్లటం నగరానికి పేరు ప్రఖ్యాతలు పెంచుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది యూపీఈఎల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించే. చాలా కాలం నుంచి దేశంలోని పెద్దపెద్ద పరిశ్రమల్లోనికి యంత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలకు రిపేర్ సేవలను అందించే వ్యాపారంలో ఉంది. దీనిని అజయ్ కుమార్ ఇనమడుగు, నాగరాజు పత్తిపాటి స్థాపించారు. ఇటీవల కంపెనీ ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ప్రదర్శన అయిన ఎంటీఏ వియత్నాం 2025లో పాల్గొనటం గమనార్హం. అనేక విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవటం ద్వారా ఇతర దేశాలకు వ్యాపార విస్తరణలో కంపెనీ ప్రస్తుతం నిమగ్నమైంది.
భారతదేశంలో ఇప్పటికే కంపెనీ 6వేలకు పైగా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయగా.. కంపెనీ ప్రస్తుతం 2వేల 400 రిజిస్ట్రర్డ్ కస్టమర్ బేస్ కలిగి ఉంది. ప్రస్తుతం కంపెనీ పరిశ్రమల్లో వినియోగించే వీఎఫ్డీలు, సర్వో సిస్టమ్స్, హెచ్ఎంఐలు, పీఎల్సీలు, పవర్ సప్లైలు, పరిశ్రమల్లో వాడే పీసీలు, కంట్రోల్ సిస్టమ్స్ వంటి వివిధ పరికరాలను రిపేర్ చేస్తుంటుంది.
ALSO READ : ఎలక్ట్రానిక్స్, ఫార్మాకే పీఎల్‌ఐ రాయితీలు ఎక్కువ
కంపెనీ విద్యుత్ ఉత్పత్తి, ఫార్మా, ఆటో, టెక్స్ టైల్, ప్యాకేజింగ్, వాటర్ ప్యూరిఫికేషన్ వంటి రంగాల్లో ఉన్న కంపెనీలకు తన సేవలను అందిస్తోంది. ప్రస్తుత ప్రయత్నం ద్వారా కంపెనీ తన వ్యాపారాన్ని తైవాన్, దక్షిణ కొరియా సహా మరిన్ని దేశాలకు విస్తరించాని చూస్తోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి చేసే ఈ దేశాల్లో విస్తరణ తమ వ్యాపార నైపుణ్యాలను అలాగే కొత్త ఆదాయాలను తెచ్చిపెడుతుందని కంపెనీ భావిస్తోంది. కంపెనీని కేవలం భారతదేశానికి పరిమితం చేయకుండా ప్రపంచ స్థాయిలో పరిశ్రమలకు పరిష్కారాలను అందించే స్థాయికి తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నట్లు కంపెనీ సీఈవో నరేష్ పేర్కొన్నారు.
కంపెనీ తన సేవల ద్వారా నిరంతరం సపోర్ట్, వారెంటీని కూడా అందిస్తోంది. ఇది పరిశ్రమల్లో ఉత్పత్తికి ఆటంకాలు కలకకుండా, డౌన్ టైమ్ నివారణకు సహాయపడుతుందని తెలుస్తోంది. ఇందుకోసం కంపెనీ వివిధ ప్యాకేజీల కింద తన సేవలను ఆఫర్ చేస్తోందని తెలుస్తోంది. పరిశ్రమలకు నమ్మదగిన సేవల సంస్థగా మారాలన్నదే తమ లక్ష్యం అని యూపీఈఎల్ ప్రతినిధులు చెబుతున్నారు.