ఎలక్ట్రానిక్స్, ఫార్మాకే పీఎల్‌‌‌‌ఐ రాయితీలు ఎక్కువ

ఎలక్ట్రానిక్స్, ఫార్మాకే  పీఎల్‌‌‌‌ఐ రాయితీలు ఎక్కువ

 

  • 2024–25 లో కేటాయించిన 
  • మొత్తం అమౌంట్‌‌‌‌లో 70 శాతం ఈ రెండు రంగాలకే 


న్యూఢిల్లీ: ప్రొడక్షన్ -లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌‌‌‌ఐ) స్కీమ్‌‌‌‌ల కింద 2024-–25లో ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఆర్థిక ప్రోత్సాహకాల్లో 70శాతం ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలకు వెళ్లాయి.   14 రంగాల్లో దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు రూ.1.97 లక్షల కోట్లతో 2021లో పీఎల్‌‌‌‌ఐ స్కీమ్‌‌‌‌ను  తీసుకొచ్చారు. 2024–-25లో ప్రభుత్వం రూ.10,114 కోట్లను   విడుదల చేసింది.  ఇందులో ఎలక్ట్రానిక్స్ రంగానికి రూ.5,732 కోట్లు, ఫార్మాస్యూటికల్ డ్రగ్స్‌‌‌‌కు రూ.2,328 కోట్లు కేటాయించారు.   బల్క్ డ్రగ్స్ (రూ. 22 కోట్లు), మెడికల్ డివైసెస్ (రూ.77 కోట్లు), టెలికం (రూ.840 కోట్లు), ఫుడ్ ప్రాసెసింగ్ (రూ.448 కోట్లు), వైట్ గూడ్స్ (రూ. 210 కోట్లు), ఆటోమొబైల్స్ (రూ.322 కోట్లు), స్పెషాలిటీ స్టీల్ (రూ.48 కోట్లు), టెక్స్‌‌‌‌టైల్స్ (రూ.40 కోట్లు), డ్రోన్స్ (రూ.35 కోట్లు)  రంగాలకు కూడా కేటాయింపులు జరిగాయి. 

కాగా, 2023–--24లో  పీఎల్‌‌‌‌ఐ కింద  రూ.9,721 కోట్లను రాయితీల కింద ప్రభుత్వం విడుదల చేసింది. పీఎల్‌‌‌‌ఐ  పథకాలు ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశీయ తయారీ, ఎగుమతులను గణనీయంగా పెంచాయి.  ఇండియా   టాప్‌‌‌‌3 ఎగుమతి  రంగాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు 2023–-24లో 29.12 బిలియన్ డాలర్లు ఉండగా, 2024-–25లో 38.58 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది 32.46శాతం పెరుగుదల. కంప్యూటర్ హార్డ్‌‌‌‌వేర్, పెరిఫెరల్స్ ఎగుమతులు 101శాతం పెరిగి 0.7 బిలియన్ డాలర్ల నుంచి 1.4 బిలియన్‌‌‌‌ డాలర్లకు ఎగిశాయి. యూఏఈ, యూఎస్‌‌‌‌, నెదర్లాండ్స్, యూకే, ఇటలీకి  ఎలక్ట్రానిక్‌‌‌‌ గూడ్స్‌‌‌‌ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ఫార్మా ఎగుమతులు 2024-–25లో 30.5 బిలియన్ డాలర్లకు చేరాయి.